Skip to main content

గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?

ఏళ్ల నాటి గిరిపుత్రుల కలలను నెరవేరుస్తూ ‘గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ’ కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
Current Affairs

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు గిరిజన మహిళలకు స్వయంగా క్యాంపు కార్యాలయంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందజేశారు. మొత్తం 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలపై హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు.

కురుపాంలో గిరిజన కళాశాల...
విశాఖ జిల్లా పాడేరులో వైద్య కళాశాల, ఐటీడీఏ పరిధిలో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు, విజయనగరం జిల్లా కురుపాంలో ఏర్పాటు చేయనున్న గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిలాఫలకాలనును ఆవిష్కరించారు.

సీఎం ప్రసంగం-ప్రధానాంశాలు

  • రాష్ట్రంలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసి మంచి జరిగేలా కార్యక్రమాలను చేపడుతున్నాం.
  • దాదాపు 1.53 లక్షల గిరిజన కుటుంబాలకు 3.12 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం.
  • ఈ కార్యక్రమం నెల రోజులు కొనసాగుతుంది. హక్కుల పత్రాల పంపిణీ, దాంతో పాటు రైతు భరోసా సొమ్ము ఇస్తాం. గిరిజనులను రైతులుగా చేసి, వారికి మంచి జరిగేలా చేయాలన్నదే మా లక్ష్యం.
  • గిరిజనులందరికీ కనీసం 2 ఎకరాల భూమి ఇవ్వాలన్న తాపత్రయంతో, ఆ అక్క చెల్లెమ్మలకు ఇవాళ్టి నుంచి పత్రాలు ఇస్తున్నాం.
  • పట్టాలు పొందిన అక్క చెల్లెమ్మలకు భూమి అభివృద్ధి మాత్రమే కాకుండా, నీటి సదుపాయం, తోటల పెంపకానికి సహాయం చేస్తున్నాం.
  • గిరిజనుల ఆదాయం పెంచడంతో పాటు, అడవుల్లో మరింత పచ్చదనం పెరిగేలా చర్యలు చేపడుతున్నాం.
  • పాడేరులో దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల నిర్మాణ పనులు మొదలు పెడుతున్నాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీకార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : గిరిజనుల ఆదాయం పెంచేందుకు, వారిని రైతులుగా చేసేందుకు
Published date : 03 Oct 2020 05:54PM

Photo Stories