గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
Sakshi Education
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఏప్రిల్ 20న ప్రారంభమైంది.
1,500 బెడ్‌లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దం చేశారు. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇందులో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిని సిద్ధం చేయడంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయగా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనం, హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) ఆస్పత్రి ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనం, హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
Published date : 21 Apr 2020 06:27PM