గాప్ ఇంక్ సీఈవోగా సోనియా సింగాల్
Sakshi Education
ఫార్చూన్500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’ సీఈవోగా భారత సంతతి మహిళ సోనియా సింగాల్ నియమితులయ్యారు.
గాప్ ఇంక్‌లో 2004లో చేరిన 49 ఏళ్ల సింగాల్ గ్రూప్‌లోని ఓల్డ్ నేవీ సీఈవోగా, గాప్ ఇంక్ యూరప్ ఎండీగా ఉన్నారు. అంతకుముందు సన్ మైక్రోసిస్టమ్స్, ఫోర్డ్ మోటార్స్‌లో 15 ఏళ్లపాటు పనిచేశారు. భారత్‌లో పుట్టిన సింగాల్ కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సింగాల్ కెట్టరింగ్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు.
గాప్ ఇంక్ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు. అమెరికాసహా విదేశాల్లో 3,727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫార్చూన్500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గాప్ ఇంక్ సీఈవోగా నియామకం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : సోనియా సింగాల్

Published date : 10 Mar 2020 06:51PM