Skip to main content

గాంధీ ఐసీయూలో మొబైల్ రోబో సేవలు

అత్యంత వేగంగా పనిచేసే క్రిమి సంహారక రోబోను హైదరాబాద్‌కు చెందిన రీవాక్స్ ఫార్మా సంస్థ జూలై 11న ఐటీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గాంధీ ఆస్పత్రికి విరాళంగా అందజేసింది.
Edu news‘యూవీ రోవా బీఆర్’గా నామకరణం చేసిన ఈ మొబైల్ రోబో ఎలాంటి రసాయనాలు లేదా ఆవిరి లేకుండానే ఐదు నిమిషాల వ్యవధిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిములను సంహరిస్తుంది. కోవిడ్-19 బారిన పడుతున్న వారికి కీలక సేవలు అందిస్తున్న గాంధీ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో త్వరలో ఈ రోబో సేవలు ప్రారంభమవుతారుు. రీవాక్స్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ యూవీ రోవా బీఆర్‌ను రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
గాంధీ ఐసీయూలో మొబైల్ రోబో సేవలు
ఎప్పుడు : జూలై 11
ఎవరు : రీవాక్స్ ఫార్మా సంస్థ
ఎందుకు : ఎలాంటి రసాయనాలు లేదా ఆవిరి లేకుండానే ఐదు నిమిషాల వ్యవధిలో బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిములను సంహరించేందుకు
Published date : 14 Jul 2020 12:09PM

Photo Stories