ఎయిరిండియా వన్-బీ777 గగన విహారం ప్రారంభం
దేశంలో అత్యంత ప్రముఖుల అధికారిక పర్యటనల కోసం ఉద్దేశించిన ఎయిరిండియా వన్-బీ777 తన గగన విహారాన్ని నవంబర్ 24న ప్రారంభించింది. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత ప్రథమ మహిళ సవితా కోవింద్ అందులో తొలి ప్రయాణం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వారు ఈ కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వన్‌బీ77 విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు.
బీ747-400 స్థానంలో...
ఎయిరిండియా వన్-బీ777లో తమ తొలి ప్రయాణాన్ని ఆరంభించడానికి ముందు రాష్ట్రపతి దంపతులు న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు వీవీఐపీల కోసం వాడుతున్న బీ747-400 స్థానంలో ఈ కొత్త బీ777ను తీసుకువచ్చారు. ఈ విమానం అమెరికాలో సిద్ధమై 2020, అక్టోబర్ 1న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
చదవండి: ఎయిరిండియా వన్-బీ777: సమగ్ర సమాచారం