Skip to main content

ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది.
యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్ సీజీఎం జె.స్వామినాథన్ మార్చి 15న బ్యాంక్ ఆవరణలో సేవలను ప్రారంభించారు.

16,500 ఏటీఎంల్లో సేవలు..
దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరల్లో యోనో క్యాష్ సేవలను వినియోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దేశంలోని 16,500 ఏటీఎంలు యోనో క్యాష్ పాయింట్లుగా మారతాయని పేర్కొంది. భౌతికంగా డెబిట్ కార్డు లేకుండా విత్‌డ్రా సేవలను ప్రారంభించిన తొలి బ్యాంక్‌గా ఎస్‌బీఐ నిలిచిందని బ్యాంక్ తెలిపింది.

ఎలా పనిచేస్తుందంటే..?
ముందుగా వినియోగదారులు యోనో యాప్‌లో కార్డ్‌లెస్ విత్‌డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 6 అంకెల యోనో క్యాష్ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వినియోగదారునికి బ్యాంక్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఎస్‌ఎంఎస్ రూపంలో 6 అంకెల రిఫరెన్స్ నంబరు వస్తుంది. యోనో క్యాష్ పిన్, రిఫరెన్స్ నంబరు రెండింటినీ ఉపయోగించి ఏటీఎం పాయింట్‌లో నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. రిఫరెన్స్ నంబరు వచ్చిన 30 నిమిషాల లోపు లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి :
ఏటీఎం కార్డు లేకుండానే నగదు విత్‌డ్రా
ఎప్పుడు : మార్చి 15 నుంచి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : యోనో యాప్ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలు
Published date : 16 Mar 2019 06:21PM

Photo Stories