Skip to main content

ఎస్‌ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీ ప్రయోగం విజయవంతం

భారత్‌ చేపట్టిన సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌(ఎస్‌ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీ ఫ్లైట్‌ టెస్ట్‌ విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌) నుంచి మార్చి 5న ఈ ప్రయోగం నిర్వహించారు.
Edu news

 ఈ టెక్నాలజీ సాయంతో ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణులను అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం ఈ సాంకేతికత కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) తెలిపింది.

తాజ ప్రయోగంలో డీఆర్‌డీవోతో పాటు డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌), రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ సహా దేశంలోని పలు ప్రయోగశాలలు పాలుపంచుకున్నాయి.

క్విక్రివ్యూ :
ఏమిటి : సాలిడ్‌ ఫ్యూయెల్‌ డక్టెడ్‌ రామ్‌జెట్‌(ఎస్‌ఎఫ్‌డీఆర్‌) టెక్నాలజీ ఫ్లైట్‌ టెస్ట్‌ విజయవంతం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత్‌
ఎక్కడ : ఐటీఆర్, చాందీపూర్, బాలాసోర్‌ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు

Published date : 06 Mar 2021 06:54PM

Photo Stories