Skip to main content

ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన-2021 ఎక్కడ జరుగుతోంది?

కర్ణాటక రాష్టంలోని బెంగళూరు యలహంక వైమానిక స్థావరంలో 13వ అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘‘ఏరో ఇండియా-2021’’ జరుగుతోంది.
Current Affairs
ఫిబ్రవరి 3న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సుమారు 78 విదేశీ కంపెనీలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.

బెంగళూరులో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లోని తేజస్ కేంద్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘‘తేజస్‌మార్క్-2 యుద్ధ విమాన తయారీ కేంద్రం’’ ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హెచ్‌ఏఎల్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన-2021
ఎప్పుడు : ఫిబ్రవరి 3, 4, 5
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : యలహంక వైమానిక స్థావరం, బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన కోసం
Published date : 04 Feb 2021 06:13PM

Photo Stories