Skip to main content

ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా చైనా మంత్రి

ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) డెరైక్టర్ జనరల్‌గా చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ ఎన్నికయ్యారు.
దీంతో ఎఫ్‌ఎఓ సారథిగా ఎన్నికైన తొలి చైనా వ్యక్తిగా క్యూ గుర్తింపు పొందారు. ఎఫ్‌ఎఓ 41వ వార్షిక సదస్సు సందర్భంగా జూన్ 23న నిర్వహించన ఓటింగ్‌లో క్యూకు మొత్తం పోలయిన 191 ఓట్లలో 108 ఓట్లు లభించాయి. 2019, ఆగస్టు 1న క్యూ ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఐరాస ఎఫ్‌ఎఓ డెరైక్టర్ జనరల్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : చైనా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ
Published date : 27 Jun 2019 05:53PM

Photo Stories