ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా మన్‌ప్రీత్
Sakshi Education
2019 ఏడాదికి గానూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును భారత పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్ గెల్చుకున్నాడు.
దీంతో ఈ అవార్డును గెల్చుకున్న తొలి భారత హాకీ ప్లేయర్‌గా మన్‌ప్రీత్ రికార్డు నెలకొల్పాడు. పురుషుల విభాగంలో ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం బెల్జియం ప్లేయర్ ఆర్థర్ వాన్ డోరెన్, అర్జెంటీనా ఆటగాడు లుకాస్ విల్లాలు పోటీ పడగా... పోలైన మొత్తం ఓట్లలో 35.2 శాతం ఓట్లను దక్కించుకున్న మన్‌ప్రీత్ విజేతగా నిలిచాడు. ఆర్థర్ 19.7 శాతం, లుకాస్ 16.5 శాతం ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇప్పటికే మన్‌ప్రీత్‌తో పాటు భారత యువ మిడ్‌ఫీల్డర్ వివేక్ సాగర్ ప్రసాద్ ఎఫ్‌ఐహెచ్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత ప్లేయర్ లాల్‌రెమ్‌సియామి గెల్చుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : మన్‌ప్రీత్ సింగ్

Published date : 14 Feb 2020 05:48PM