Skip to main content

ఏపీలో ఉభయతారక ప్రయోజన పథకం

కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడిన తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థలు పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా ఉభయతారక ప్రయోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Current Affairs

దేశంలోనే తొలిసారిగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ఉద్యాన శాఖ తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలను రైతుల నుంచి నేరుగా సేకరించి.. గ్రామాలు, పట్టణ కాలనీలలో విక్రయించే నమూనాను రూపొందించి అమలు చేస్తోంది. ప్రస్తుత విపత్తు సమయంలోనే కాకుండా భవిష్యత్‌లో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు ఈ నమూనాను అమలు చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏప్రిల్ 4న సర్కులర్‌ జారీ చేసింది.


క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉభయతారక ప్రయోజన పథకానికి శ్రీకారం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : కరోనా ప్రభావంతో మార్కెట్లు మూతపడిన తరుణంలో నష్టపోతున్న రైతులు, అవస్థలు పడుతున్న వినియోగదారులను ఆదుకునేలా
Published date : 06 Apr 2020 06:43PM

Photo Stories