Skip to main content

ఏపీలో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు

శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎలా పనిచేస్తుందో అదే మాదిరిగా బీసీ కమిషన్ కూడా పనిచేస్తుందని గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు తాత్కాలిక ప్రాతిపదికన బీసీ కమిషన్ పనిచేసిన విషయం తెలిసిందే.

శాశ్వత బీసీ కమిషన్
ఉద్దేశం
  • బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడం.
  • బీసీల సాధికారత కోసం నిరంతరం పని చేయడం.
  • కుల సర్టిఫికెట్ల సమస్యలు, గ్రూపుల్లో మార్పు, చేర్పులు.
  • సామాజిక, ఆర్థిక, విద్య, ఇతర స్థితిగతుల ద్వారా బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం.

ఉపయోగాలు
  • బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను కల్పిస్తుంది.
  • ఎవరైనా తమను బీసీ జాబితాలో చేర్చాలని కోరితే అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసు చేస్తుంది.
  • విద్యా సంస్థల అడ్మిషన్లలో, ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం ఫిర్యాదులపై విచారణ.
  • బీసీల సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనం.
  • బీసీల అభ్యున్నతికి అవసరమైన సంక్షేమ, ఇతర విధానాల రూపకల్పన.
  • బీసీలపై వేధింపులు లేదా సామాజిక బహిష్కరణ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సమగ్ర దర్యాప్తు.
Published date : 20 Aug 2019 05:22PM

Photo Stories