Skip to main content

ఏపీలో ప్రైవేట్‌ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి

రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆస్పత్రులు సైతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
Current Affairs
ప్రైవేట్‌ పరిధిలోని వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ మార్చి 30న ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 (సెక్షన్‌ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, ప్రభుత్వేతర ఆస్పత్రులు, ట్రస్ట్‌ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఇకపై సర్కారు పరిధిలో పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెంచుతారు.

దేశవ్యాప్తంగా పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఎపిడెమిక్‌ డిసీజ్‌ (కోవిడ్‌) రెగ్యులేషన్‌ 2020 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రైవేట్‌ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు
Published date : 31 Mar 2020 06:23PM

Photo Stories