ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి సదుపాయాలతో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆగస్టు 13న సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2019, డిసెంబర్ 21 నుంచి క్యూ ఆర్ కోడ్‌తో కూడిన హెల్త్‌కార్డును ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగు కింద కంటి పరీక్షలు ప్రారంభించాలని ఆదేశించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో ఐదు క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కడప, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, తిరుపతి
Published date : 14 Aug 2019 07:10PM