Skip to main content

ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపు

ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బులను చెల్లించే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది.
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌‌సలో నవంబర్ 7న జరిగిన అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బుల చెల్లింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ... తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. డిపాజిట్లు రూ.20 వేలలోపు కట్టిన వారు దాదాపు 14 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 వార్షిక బడ్జెట్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు కేటాయించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపు
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

మాదిరి ప్రశ్నలు
1. 2019-20 వార్షిక బడ్జెట్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్ని రూపాయలు కేటాయించారు.
1. రూ. 1,250 కోట్లు             2. రూ. 2,150 కోట్లు
3. రూ. 2,250 కోట్లు             4. రూ. 1,150 కోట్లు
సమాధానం : 4

2. అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బులను చెల్లించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1. 2019, నవంబర్ 8            2. 2019, అక్టోబర్ 7
3. 2019, నవంబర్ 7            4. 2019, సెప్టెంబర్ 7
సమాధానం : 3
Published date : 08 Nov 2019 05:46PM

Photo Stories