ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్ ప్రారంభం
Sakshi Education
రైతుల కోసం రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 18న ప్రారంభించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నవంబర్ 18న జరిగిన ఐదో అగ్రి మిషన్ సమావేశం సందర్భంగా ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అగ్రి మిషన్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు వేదికలైన మార్కెట్ యార్డులను ‘నాడు-నేడు’ కింద ఆధునికీకరించడంతో పాటు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ట పరచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే దుకాణాలు, వర్క్‌షాపులు జనవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంప్ కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా

Published date : 19 Nov 2019 05:05PM