ఏపీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసర్వేకు రూపొందించిన ప్రత్యేక యాప్ పేరు?
ఇప్పటివరకు రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలు, అటవీ విభాగం కలిసి ఆఫ్‌లైన్‌లో మాత్రమే భూసర్వే చేసేవి. ఇకపై ఆన్‌లైన్‌లోనూ అన్ని వివరాలు నమోదు చేసే విధంగా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు.
ఇటీవల ప్రభుత్వం లక్షన్నర మంది గిరిజన రైతులకు 3.50 లక్షల ఎకరాలకు సంబంధించి రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ (ఆర్‌వోఎఫ్‌ఆర్) పట్టాలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అవకాశం కల్పిస్తూ గిరిజన సంక్షేమ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ యాప్‌కు రూపకల్పన చేశారు.
చదవండి: గిరిజనులకు అటవీ భూములపై హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐటీడీఏ ల్యాండ్ సర్వే పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పన
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ
ఎందుకు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసర్వే కోసం