Skip to main content

ఏపీ సైన్స్ సిటీ సీఈవోగా జయరామిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా డాక్టర్ జయరామిరెడ్డి కొండాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 18న ఉత్తర్వులు జారీ చేసింది.
Current Affairsఆయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏపీ సైన్స్ సిటీ వైస్ చైర్మన్, సీఈవోగా ఉన్న డాక్టర్ అప్పసాని కృష్ణారావును బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. జయరామిరెడ్డి ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : డాక్టర్ జయరామిరెడ్డి కొండా
Published date : 19 Mar 2020 05:32PM

Photo Stories