ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా నియమితులైన నేత?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా పీడీఎఫ్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.
మండలిలో ప్రస్తుతం అందరి కంటే సీనియర్‌గా ఉన్న బాలసుబ్రహ్మణ్యం పేరును ప్రభుత్వం ఖరారు చేసి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు నివేదించగా ఆయన ఆమోదించారు. ఈ మేరకు జూన్ 18న గవర్నర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యే వరకూ బాలసుబ్రహ్మణ్యం ప్రొటెం చైర్మన్‌గా కొనసాగనున్నారు.
ఇటీవల వరకు శాసన మండలి చైర్మన్‌గా ఉన్న ఎంఏ షరీఫ్ పదవీకాలం 2021, మే 24నాటికి ముగిసిన విషయం తెలిసిందే. డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవీకాలం జూన్ 18 నాటికి ముగిసింది. దీంతో సభలో కీలకమైన 2 స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు తాత్కాలికంగా ప్రొటెం చైర్మన్‌ను గవర్నర్ నియమించాల్సి ఉంటుంది. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియను ప్రొటెం చైర్మన్ చేపట్టాలి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా నియమితులైన నేత?
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
ఎందుకు : శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల పదీవీ కాలం ముగిసినందున...

Published date : 19 Jun 2021 06:43PM