Skip to main content

ఏపీ రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ శ్రీధర్‌రెడ్డి

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్‌గా విజయవాడకు చెందిన ప్రముఖ దంత వైద్యుడు ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
Current Affairsఅలాగే రెడ్‌క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్‌గా పి.జగన్మోహన్‌రావు, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అశ్విన్‌కుమార్ పరీదా జనరల్ సెక్రటరీగా, కోశాధికారిగా జి.వై.ఎన్.బాబు ఎన్నికయ్యారు. రాజ్‌భవన్‌లో నవంబర్ 27న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ప్రముఖ దంత వైద్యుడు ఆరుమళ్ల శ్రీధర్‌రెడ్డి
Published date : 28 Nov 2019 06:02PM

Photo Stories