Skip to main content

ఏపీ జలవనరుల శాఖకు సీబీఐపీ అవార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు ‘సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇరిగేషన్ అండ్ పవర్’ (సీబీఐపీ) అవార్డు లభించింది.
Current Affairs ఢిల్లీలో ఫిబ్రవరి 19న నిర్వహించిన సీబీఐపీ 93వ వార్షికోత్సవంలో కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా, కేంద్ర జల సంఘం చైర్మన్ ఆర్కే జైన్ చేతుల మీదుగా ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. దేశంలోనే సమగ్ర నీటి యాజమాన్య విధానాలను అత్యున్నత ప్రమాణాలతో అమలు చేయడం ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి, ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించినందుకు ఏపీకి ఈ అవార్డు దక్కింది.

మరోవైపు ఏపీ జలవనరుల సమాచారం, నిర్వహణ వ్యవస్థ (ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్)కు సేవలు అందిస్తోన్న ‘వాస్సార్ ల్యాబ్స్’కు అత్యత్తుమ కన్సల్టెన్సీగా అవార్డును ప్రదానం చేశారు.

సీబీఐపీ..
దేశంలో జల వనరులు, విద్యుత్ రంగాల్లో ‘అత్యుత్తమ’ విధానాలను అమలు చేయడానికి సీబీఐపీని కేంద్రం ఏర్పాటు చేసింది. జలవనరుల వినియోగం, విద్యుదుత్పత్తి, సరఫరాల్లో నష్టాల నివారణ తదితర విభాగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రాలను సీబీఐపీ ఎంపిక చేసి అవార్డులు ఇస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ జలవనరుల శాఖకు సీబీఐపీ అవార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర జల్ శక్తి శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సమగ్ర నీటి యాజమాన్య విధానాలను అమలు చేసినందుకు
Published date : 20 Feb 2020 07:12PM

Photo Stories