ఏపీ జాతీయ మీడియా సలహాదారుగా అమర్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ నవంబర్ 3న ఢిల్లీలోని ఏపీ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మీడియాలో గతంలో దక్షిణాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై కవరేజి తక్కువగా ఉండేదని చెప్పారు. ఇటీవల కాలంలో జాతీయ మీడియా కూడా దక్షిణాది వైపు దృష్టి పెట్టిందని.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, పాలనాపరమైన అంశాలను జాతీయ మీడియాకు చేరువయ్యేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 04 Nov 2019 05:39PM