Skip to main content

ఏపీ హెచ్ఆర్సీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ న్యాయమూర్తి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) చైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి మార్చి 24న బాధ్యతలు చేపట్టారు.
Current Affairs
అలాగే కమిషన్‌ సభ్యులుగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌), న్యాయవాది డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడిషియల్‌) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ సీతారామమూర్తి, సుబ్రహ్మణ్యంలు హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టగా, శ్రీనివాసరావు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1958, జనవరి 16న న్యాయవాదుల కుటుంబంలో సీతారామమూర్తి జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. లా ఆఫ్‌ టార్ట్స్‌లో బంగారు పతకం సాధించారు. 1996లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ... 2013, అక్టోబర్‌ 23న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, మార్చి 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2020, జనవరి 15న హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు.

డాక్టర్‌ గోచిపాత శ్రీనివాసరావు:
గుంటూరు జిల్లా నంబూరుకి చెందిన శ్రీనివాసరావు హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. న్యాయశాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. మానవ హక్కులపై ఆయన రాసిన పలు ఆర్టికల్స్‌ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

దండి సుబ్రహ్మణ్యం:
కర్నూలు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం 1955, ఆగస్టు 8న జన్మించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. జిల్లా జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆయన హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ కార్యదర్శిగా, ఏపీ మానవహక్కుల కమిషన్‌ కార్యదర్శిగానూ ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మార్చి 24
ఎవరు : హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి
ఎక్కడ : హైదరాబాద్‌
Published date : 26 Mar 2021 05:18PM

Photo Stories