ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ నవంబర్ 8న ప్రమాణ స్వీకారం చేశారు.
హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో రాకేష్‌కుమార్‌తో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ రాకతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరింది. కోర్టులో జస్టిస్ రాకేష్‌కుమార్ రెండోస్థానంలో కొనసాగుతారు.
ఇదీ నేపథ్యం..
జస్టిస్ రాకేష్‌కుమార్ 1959 జనవరి 1న బిహార్ పాట్నాలో జన్మించారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, 1983లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 6 ఏళ్ల పాటు ప్రాక్టీస్ సాగించిన ఆయన 12 ఏళ్ల పాటు సీబీఐకి స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదిగా పనిచేశారు. 2009 డిసెంబర్ 25న పాట్నా హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులై 2011, అక్టోబర్ 24న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : జస్టిస్ రాకేష్‌కుమార్
మాదిరి ప్రశ్నలు
1. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
1. 12
2. 8
3. 16
4. 15
సమాధానం : 4
2. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా ఎవరు ఉన్నారు?
1. జస్టిస్ రాకేష్‌కుమార్
2. జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి
3. జస్టిస్ శివానంద రెడ్డి
4. జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్
సమాధానం : 2

Published date : 09 Nov 2019 05:50PM