Skip to main content

ఎన్నేళ్లలో కార్పొరేట్ రుణ వ్యాపారానికి ఇండోస్టార్ గుడ్‌బై చెప్పనుంది?

బ్యాంకింగ్‌యేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ 2022 మార్చి నాటికి కార్పొరేట్ రుణ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోనుంది.
Current Affairs

ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్రీధర్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. గత రెండు సంవత్సరాలుగా కంపెనీ తన కార్పొరేట్ రుణ మంజూరీలను క్రమంగా తగ్గించుకుంటోందని ఆయన తెలిపారు. దీనితో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుస్తక విలువ రూ.3,500 కోట్లకు పరిమితమయి్యందని వివరించారు. 2018లో ఈ విలువ రూ.6,000 కోట్లని తెలిపారు. ప్రస్తుతం తమ మొత్తం రుణ పుస్తకంలో రిటైల్ విభాగానికి 73 శాతం వాటా ఉంటే, కార్పొరేట్ సెగ్మెంట్ వాటా 27 శాతమని తెలిపారు. రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఫైనాన్స్, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), చౌక గృహ రుణాలపై కంపెనీ ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. 2020 సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి ఇండోస్టార్ క్యాపిటల్ కన్సాలిడేటెడ్ లాభం 36 శాతం తగ్గి రూ.32 కోట్లుగా నమోదయి్యంది. ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ బ్రూక్‌ఫీల్డ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ- ఎవర్‌స్టోన్‌లు ఇండోస్టార్‌ను ప్రమోట్ చేస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కార్పొరేట్ రుణ వ్యాపారానికి గుడ్‌బై చెప్పనున్న ఇండోస్టార్
ఎప్పుడు : 2022 వరకు
ఎందుకు : రిటైల్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి

Published date : 30 Nov 2020 05:01PM

Photo Stories