ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
Sakshi Education
దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ వెల్లడించింది.
ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా(ఎస్‌డబ్ల్యూఐ)-2019 పేరిట ఏప్రిల్ 17న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్‌స సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ-సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016-18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు.
నివేదికలోని అంశాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : గడిచిన ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ
నివేదికలోని అంశాలు...
- దేశంలో ఉద్యోగావకాశాలు క్షీణించడంతోపాటు గడిచిన రెండేళ్ల(2016-18)లో 50 లక్షల మంది పురుషులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
- పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచే దేశంలో ఉద్యోగావకాశాలు తగ్గుతూ వచ్చాయి.
- రూరల్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ స్కీమ్ తరహాలోనే అర్బన్ ఎంప్లారుుమెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తేవాలని నివేదిక సూచించింది. దీని ద్వారా చిన్న పట్టణాల్లో సుమారు 5 కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గడిచిన ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ
Published date : 18 Apr 2019 04:48PM