Skip to main content

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్‌ఎస్‌ఈ) చైర్మన్ అశోక్ చావ్లా జనవరి 11న తన పదవికి రాజీనామా చేశారు.
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో అశోక్ చావ్లా, మరో నలుగురు కేంద్ర ప్రభుత్వ అధికారులపై చార్జీషీటు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం పొందామని సీబీఐ న్యాయవాదుల బృందం ఢిల్లీలోని స్పెషల్ కోర్ట్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలో చావ్లా రాజీనామా చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ రాజీనామా
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : అశోక్ చావ్లా
Published date : 12 Jan 2019 06:09PM

Photo Stories