ఎంపీ మార్గాని భరత్‌కు భారత్ గౌరవ్ అవార్డు
Sakshi Education
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)కు భారత్ గౌరవ్ పురస్కారం లభించింది.
న్యూఢిల్లీలో ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేతుల మీదుగా భరత్ అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైన భరత్ లోక్‌సభలో వివిధ అంశాలపై తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఈ పురస్కారంతో సత్కరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంపీ మార్గాని భరత్‌కు భారత్ గౌరవ్ అవార్డు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : లోక్‌సభలో సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా

Published date : 30 Aug 2019 05:04PM