Skip to main content

ఎంఅండ్ఎం నూతన సీఈఓగా నియమితులైన వ్యక్తి?

ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) నూతన ఎండీ, సీఈవోగా అనీష్ షా నియమితులయ్యారు.
Current Affairs
తద్వారా ఎంఅండ్‌ఎం గ్రూప్‌ చరిత్రలో తొలిసారి వృత్తిగత నిపుణుడిని సీఈవోగా ఎన్నుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌ గోయెంకా స్థానంలో అనీష్‌ బాధ్యతలు చేపట్టనున్నారని మార్చి 26న కంపెనీ తెలిపింది. 2021 ఏప్రిల్‌ 2న గోయెంకా పదవీ విరమణ చేయనున్నారు. అనీష్‌ షా ప్రస్తుతం ఎంఅండ్‌ఎం కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూప్‌ సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్నారు.

టాటా–మిస్త్రీ వివాదానికి తెర...
దేశీ కార్పొరేట్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టాటా–మిస్త్రీ వివాదానికి దాదాపు తెరపడింది. చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తొలగించిన కేసులో టాటా గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో విజయం లభించింది. మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ఉత్తర్వులను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. టాటా గ్రూప్‌లో మిస్త్రీకి చెందిన ఎస్‌పీ గ్రూప్‌ వాటాల వేల్యుయేషన్‌ను ఇరు పక్షాలు తేల్చుకోవాలంటూ మార్చి 26న సూచించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) నూతన ఎండీ, సీఈవోగా నియామకం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : అనీష్‌ షా
ఎందుకు : ప్రస్తుతం ఎంఅండ్‌ఎం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌ గోయెంకా ఏప్రిల్‌ 2న పదవీ విరమణ చేయనుండటంతో
Published date : 29 Mar 2021 12:56PM

Photo Stories