ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
Sakshi Education
ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు.
ఇటలీలోని ఐమోలాలో నవంబర్ 1న జరిగిన 63 ల్యాప్‌ల రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. బొటాస్ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లో 13 రేసులు ముగిశాక హామిల్టన్ 282 పాయింట్లతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి రేసు విజేత
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : ఐమోలా,ఇటలీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి రేసు విజేత
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : ఐమోలా,ఇటలీ
Published date : 02 Nov 2020 06:00PM