ఎల్‌అండ్‌టీ సీఈవోకు జేఆర్‌డీ టాటా అవార్డు
Sakshi Education
దేశీయ ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్‌కు ప్రతిష్టాత్మక ‘ఐఐఎం-జేఆర్‌డీ టాటా’ అవార్డు లభించింది.
కేరళలోని కోవలంలో నవంబర్ 21న జరిగిన కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా సుబ్రమణియన్ ఈ అవార్డును అందుకున్నారు. మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్‌సకు గాను సుబ్రమణియన్‌కు ఈ అవార్డు దక్కింది. 2007లో టాటా స్టీల్ నెలకొల్పిన ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డును పొందిన వారిలో రతన్ టాటా, ఈ శ్రీధరన్, సజ్జన్ జిందాల్‌లు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఎల్‌అండ్‌టీ సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్
ఎక్కడ : కోవలం, కేరళ
ఎందుకు : మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్‌సకు గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐఎం-జేఆర్‌డీ టాటా అవార్డు విజేత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఎల్‌అండ్‌టీ సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణియన్
ఎక్కడ : కోవలం, కేరళ
ఎందుకు : మెటలర్జికల్ ఇండస్ట్రీస్ విభాగంలో ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్‌సకు గాను
Published date : 22 Nov 2019 06:22PM