ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నివేదికను ఆవిష్కరించిన అంతర్జాతీయ సంస్థ?
Sakshi Education
ఐక్యరాజ్యసమితికి చెందిన యునెటైడ్ నేషన్స్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్(UNU-INWEH) అనే సంస్థ ‘‘ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్’’ నివేదికను రూపొందించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్ నివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : యునెటైడ్ నేషన్స్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్(UNU-INWEH)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై చేసిన అధ్యయన వివరాలను వెల్లడించేందుకు
ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను... ఐరాస తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యమైన అంశాలు....
- ప్రపంచవ్యాప్తంగా 1930 నుంచి 1970 మధ్య నిర్మించిన 58,700 భారీ ఆనకట్టల జీవిత కాలాన్ని 50 నుంచి 100 ఏళ్లకే రూపకల్పన చేశారు. 50 ఏళ్ల తరువాత నుంచి ఇటువంటి భారీ ఆనకట్టల సామర్థ్యం క్షీణిస్తూ వస్తుంది.
- కాలం తీరిన భారీ ఆనకట్టలతో రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రజలు పెనుముప్పును ఎదుర్కోబోతున్నారు.
- 2050 నాటికి.. అంటే మరో 30 ఏళ్లలో ఇటువంటి పురాతన ఆనకట్టలకు దిగువనే అత్యధిక మంది జీవిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది.
- నాలుగు ఆసియా దేశాల్లోనే అత్యధికంగా భారీ డ్యాంలున్నాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాల్లో మొత్తం 32,716 పెద్ద ఆనకట్టలు(ప్రపంచంలోనే 55 శాతం) ఉన్నాయి.
- ఒక్క చైనాలోనే 23,841 భారీ ఆనకట్టలు(ప్రపంచంలోని మొత్తం డ్యాంలలో 40 శాతం) ఉన్నాయి. వీటిలో చాలా వాటికి త్వరలోనే 50 ఏళ్లు పూర్తవుతాయి. వీటికి ప్రమాదం పొంచి ఉంది.
- కాలంతీరిన పెద్ద ఆనకట్టల సమస్య చాలా తక్కువ దేశాలెదుర్కొంటున్నాయి. ప్రపంచంలోని పెద్ద ఆనకట్టలలో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి.
భారతదేశంలో...
- భారతదేశంలో దాదాపు 1,115 భారీ ఆనకట్టలు నిర్మాణం జరిగి 2025 నాటికి 50 ఏళ్లు పూర్తికానుంది.
- దేశంలోని దాదాపు 4,250కి పైగా ఆనకట్టలకు 2050 నాటికి 50 ఏళ్లు నిండుతాయి. అలాగే 2050 సంవత్సరానికల్లా దేశంలోని 64 ఆనకట్టలకు 150 ఏళ్ల పూర్తవుతాయి.
- 100 ఏళ్ల క్రితం నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్ డ్యాం బద్దలైతే దాదాపు 35 లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏజింగ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఎన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్ నివేదిక ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : యునెటైడ్ నేషన్స్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వాటర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్(UNU-INWEH)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భారీ ఆనకట్టల జీవిత కాలంపై చేసిన అధ్యయన వివరాలను వెల్లడించేందుకు
Published date : 05 Feb 2021 06:13PM