Skip to main content

ఏఎండీ డెరైక్టర్‌గా డాక్టర్ డీకే సిన్హా

అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ) డెరైక్టర్‌గా డాక్టర్ డీకే సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏఎండీ అదనపు డెరైక్టర్‌గా ఉన్న సిన్హా డెరైక్టర్‌గా జనవరి 1న బాధ్యతలు చేపట్టారని ఏఎండీ ప్రకటించింది.
jobs
దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భాగాల్లో విస్తరించి ఉన్న అణు ఖనిజాల అన్వేషణలో సిన్హాకు 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున అణు ఖనిజాల నిక్షేపాల గుర్తింపులో సిన్హా విశేష కృషి చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ) డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : డాక్టర్ డీకే సిన్హా

మాదిరి ప్రశ్నలు

1. భారత నావికా దళ పైలట్ అయిన తొలి మహిళ ఎవరు?
1. సబ్-లెఫ్టినెంట్ అరుణా సింగ్
2. సబ్-లెఫ్టినెంట్ శర్వాణీ ఇందిరా
3. సబ్-లెఫ్టినెంట్ భావనా సింగ్
4. సబ్-లెఫ్టినెంట్ శివాంగీ

Published date : 02 Jan 2020 06:23PM

Photo Stories