Skip to main content

ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం

ఏపీసీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది.

Current Affairsచైర్‌పర్సన్ గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమించనుంది.  ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇప్పటి వరకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న పి.లక్ష్మీనరసింహంనుఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమిస్తూ శ్యామలరావు మరో జీవో జారీ చేశారు.

ఏఎంఆర్‌డీఏలో సభ్యులు..
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి – డిప్యూటీ చైర్‌పర్సన్
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి – సభ్యుడు 
ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌ –సభ్య కన్వీనర్‌
గుంటూరు జిల్లా కలెక్టర్‌ –సభ్యుడు 
కృష్ణా జిల్లా కలెక్టర్‌ – సభ్యుడు
టౌన్ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ –సభ్యుడు 
రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ –సభ్యుడు 
ఏపీ ట్రాన్స్ కో ఎస్‌ఈ –సభ్యుడు
ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (గుంటూరు) –సభ్యుడు
రహదారులు భవనాల శాఖ ఎస్‌ఈ (విజయవాడ) –సభ్యుడు

చదవండి:
పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ ఆమోదం

సీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు

క్విక్ రివ్యూ :
ఏమిటి :
  అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ) కమిషనర్ గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : పి.లక్ష్మీనరసింహం

Published date : 04 Aug 2020 11:32AM

Photo Stories