Skip to main content

ఏడు దేశాల పోర్టుల బిమ్స్‌టెక్ సదస్సు ప్రారంభం

బంగాళాఖాతం తీర ప్రాంత దేశాల పోర్టులకు సంబంధించి ప్రతిష్టాత్మక బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక రంగాల సమన్వయ సదస్సు-బిమ్స్‌టెక్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నవంబర్ 7న ప్రారంభమైంది.
నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంకలతో కలసి భారత్ నిర్వహిస్తున్న ఈ సదస్సును కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవ్యా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా పోర్టులతో థాయ్‌లాండ్ మూడు ఎంవోయూలు చేసుకుంది.

అనంతరం మంత్రి మన్‌సుఖ్ మాట్లాడుతూ... పాంతీయ అభివృద్ధిలో భాగంగా పోర్టుల మధ్య సంయుక్త భాగస్వామ్యంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పోర్టుల నేషనల్ గ్రిడ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి అన్ని పోర్టులూ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏడు దేశాల పోర్టుల బిమ్స్‌టెక్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవ్యా
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

మాదిరి ప్రశ్నలు
1. ఏడు దేశాల పోర్టుల బిమ్స్‌టెక్ సదస్సు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?
1. నవంబర్ 7, కోల్‌కతా
2. నవంబర్ 5, చెన్నై
3. నవంబర్ 7, విశాఖపట్నం
4. నవంబర్ 6, కోల్‌కతా
సమాధానం : 3

2. ఇటీవల చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా పోర్టులతో ఏ దేశం మూడు ఎంవోయూలు చేసుకుంది?
1. భూటాన్
2. బంగ్లాదేశ్
3. మయన్మార్
4. థాయిలాండ్
సమాధానం : 4
Published date : 08 Nov 2019 05:53PM

Photo Stories