ఏ వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది?
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో మరణించిన వందలాది పక్షుల్లో బర్డ్‌ఫ్లూ ఉందని నిర్ధారించారు. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో మరణించిన పక్షుల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు గుర్తించారు. వీటిలో ప్రత్యేకించి హిమాచల్‌ప్రదేశ్‌లోని పాంగ్ డామ్ సరస్సు వద్ద ఏకంగా 1,800 వలస పక్షులు మరణించినట్లు కనుగొన్నారు.
బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా (Avian influenza) అని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈ వ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. ‘‘హెచ్5ఎన్1(H5N1)’’అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది.
చదవండి: ముఖ్యమైన వైరల్ వ్యాధులు-వాటి లక్షణాలు-ఎలా వ్యాపిస్తాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వందలాది పక్షుల్లో బర్డ్‌ఫ్లూ గుర్తింపు
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్