ఏ రెండు ప్రాంతాలను అనుసంధానించే గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధాని ప్రారంభించారు?
Sakshi Education
కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును అనుసంధానించే 450 కిలోమీటర్ల సహజవాయువు గ్యాస్ పైపులైన్‌ను జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... యావత్ దేశాన్ని ఒకే గ్యాస్ పైపులైన్ గ్రిడ్‌తో అనుసంధానించనున్నట్టు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు.
- గుజరాత్‌లో పవన, సౌర విద్యుత్‌తో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ పనులు మొదలు కాగా.. 5-6 ఏళ్లలో సహజవాయువు పైపులైన్‌ను 32,000 కిలోమీటర్లకు విస్తరించనున్నాం.
- సహజవాయువు వల్ల అధిక కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు, ఇతర ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది.
- ప్రస్తుతం దేశ ఇంధన వినియోగంలో 58 శాతం వాటా బొగ్గుదే. పెట్రోలియం, ఇతర వనరుల వాటా 26 శాతంగా ఉంది. సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వాటా 6, 2 శాతంగానే ఉన్నాయి.
- 2030 నాటికి సహజవాయువు వాటాను 15 శాతానికి చేర్చనున్నాము.
- చెరకు, ఇతర సాగు ఉత్పత్తుల నుంచి తీసే ఇథనాల్‌ను పెట్రోల్‌లో 20 శాతం వినియోగించనున్నాము.
- 14 కోట్ల కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ఆరేళ్లలో ఎల్‌పీజీ వినియోగదారుల సంఖ్యను రెట్టింపు చేశాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 450 కిలోమీటర్ల సహజవాయువు గ్యాస్ పైపులైన్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో ఎందుకు : కేరళలోని కోచి నుంచి కర్ణాటకలోని మంగళూరును అనుసంధానించేందుకు
Published date : 06 Jan 2021 06:47PM