ఏ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా పాల్గొన్నారు?
Sakshi Education
ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ చివరి దశ(మూడో దశ) ప్రయోగాలు హరియాణా రాష్ట్రంలో నవంబర్ 20న ప్రారంభమయ్యాయి.
ఈ ప్రయోగాల్లో భాగంగా మొదటి వాలంటీర్‌గా హరియాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 67 ఏళ్ల అనిల్‌కు కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు. మంత్రి అనిల్ విజ్‌తో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : హరియాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్
ఎక్కడ : అంబాలా ప్రభుత్వ ఆస్పత్రి, అంబాలా జిల్లా, హరియాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : హరియాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్
ఎక్కడ : అంబాలా ప్రభుత్వ ఆస్పత్రి, అంబాలా జిల్లా, హరియాణ
Published date : 21 Nov 2020 05:51PM