ఏ ప్రభుత్వ సంస్థ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశారు?
Sakshi Education
భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ‘కోవాగ్జిన్’ అనే కోవిడ్–19 టీకాను అభివృద్ధి చేసింది.
కోవాగ్జిన్ టీకా మూడో డోసు క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది. కొందరు వాలంటీర్లపై మూడో డోసును ప్రయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఏప్రిల్ 2న భారత్ బయోటెక్ సంస్థకు అనుమతినిచ్చింది. 6 ఎంసీజీల మోతాదులో బూస్టర్ డోస్(మూడో డోసు) ఇవ్వాలని భారత్ బయోటెక్‌కు సూచించింది. ప్రస్తుతం డీసీజీఐ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ వీజీ సోమాని ఉన్నారు.
టీకా ఎగుమతులపై నిషేధం లేదు...
కోవిడ్ టీకాలపై నిషేధం విధించలేదని విదేశాంగ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం చేపట్టిన ‘వ్యాక్సిన్ మైత్రి’ విధానం ప్రపంచదేశాల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా సాగుతోందని వివరించింది. విదేశాలకు అందజేసిన 6.40 కోట్ల డోసుల్లో 1.04 కోట్ల డోసులు గ్రాంట్‌గాను, 3.57 కోట్ల డోసులు వాణిజ్య విధానంలోనూ, 1.82 కోట్ల డోసులు కోవాక్స్ విధానం కింద సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

Published date : 03 Apr 2021 05:48PM