ఏ దేశ రాజధానిలో గ్లోబల్ టెక్నాలజీ సదస్సు-2021 జరగనుంది?
Sakshi Education
జపాన్ రాజధాని టోక్యోలో 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021 జరగనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)
ఎక్కడ : టోక్యో, జపాన్
ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావుకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రండే జనవరి 5న లేఖ రాశారు.
భారత జీడీపీ ఎంత శాతం క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది?
భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21)లో మైనస్ 9.6 శాతం మేర క్షీణిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ‘‘అంతర్జాతీయ ఆర్థిక అవకాశాలు’’ పేరుతో జనవరి 5న ఒక నివేదికను విడుదల చేసింది. 2021లో భారత జీడీపీ 5.4 శాతానికి కోలుకుంటుందని ఆ నివేదికలో అంచనా వేసింది.
- ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి లో ఉంది.
- ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడిగా డేవిడ్ ఆర్. మాల్‌పాస్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్) శిఖరాగ్ర సదస్సు-2021
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)
ఎక్కడ : టోక్యో, జపాన్
Published date : 06 Jan 2021 05:48PM