ధర్మశాలలో పెట్టుబడుల సదస్సు ప్రారంభం
Sakshi Education
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 7 ప్రారంభించారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ... పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంటుందన్నారు. పర్యాటకం, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధర్మశాల పెట్టుబడుల సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : హిమాచల్ ప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధర్మశాల పెట్టుబడుల సదస్సు ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
ఎందుకు : హిమాచల్ ప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు
Published date : 08 Nov 2019 05:57PM