Skip to main content

ఢిల్లీలో అత్యంత చలిదినంగా డిసెంబర్ 30

దేశరాజధాని ఢిల్లీలో 2019, డిసెంబర్ 30వ తేదీని అత్యంత చలిదినంగా భారతవాతావరణ శాఖ ప్రకటించింది.
Current Affairsఢిల్లీలో 119 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా డిసెంబర్‌లో 9.4 డిగ్రీ సెల్సియస్‌ల అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని డిసెంబర్ 30న తెలిపింది. ఢిల్లీలో రెండో అత్యంత శీతల డిసెంబర్‌గా 2019 డిసెంబర్ నిలిచిందని వెల్లడించింది. ఈ చలి ప్రభావం విమాన, రైళ్ల రాకపోకలపై పడింది.

చలి పెరగడానికి కారణం..
ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న కొండప్రాంతాల్లో డిసెంబర్ నెలలో భారీగా మంచు కురవడానికి, చలికాలంలో అక్కడ వర్షాలు కురవడానికి కారణమైన పశ్చిమ తుపాను గాలులు(వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్) గత 10 రోజులుగా వీయకపోవడం అందుకు కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఆ గాలులు ఢిల్లీ వైపు వీచే అతి శీతల గాలుల దిశను మారుస్తాయని, అవి రాకపోవడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రస్థాయికి చేరిందని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ సమాచార కేంద్ర డెరైక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
119 ఏళ్ళలో అత్యంత చలిదినంగా డిసెంబర్ 30
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : భారతవాతావరణ శాఖ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 31 Dec 2019 05:35PM

Photo Stories