ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
Sakshi Education
కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు.
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఫిబ్రవరి 16న జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్‌జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేరుుంచారు. అలాగే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్‌లతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : అరవింద్ కేజ్రీవాల్
ఎక్కడ : రాంలీలా మైదానం, ఢిల్లీ

Published date : 17 Feb 2020 05:59PM