ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తాం: సీఎం పళనిస్వామి
Sakshi Education
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2020లో కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం తిరస్కరించింది.
రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగస్టు 3న ప్రకటించారు. రాష్ట్రంలో 8 దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానం నుంచి వైదొలిగేది లేదని స్పష్టం చేశారు. 5వ తరగతి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరపాలని ఎన్ఈపీ ప్రతిపాదించింది. అయితే, హిందీ, సంస్కృతాలను తమపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేత ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
చదవండి: జాతీయ విద్యా విధానం 2020-సమగ్ర సమాచారం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటాం
ఎప్పుడు : ఆగస్టు 3
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
Published date : 04 Aug 2020 05:27PM