Skip to main content

దక్కన్ డయలాగ్-2020 సమావేశాన్ని నిర్వహించిన సంస్థ?

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) ఆధ్వర్యంలో నవంబర్ 16న దక్కన్ డయలాగ్-2020 వర్చువల్ సమావేశం జరిగింది.
Current Affairsఈ సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ అనేది వాణిజ్య విధానం కాదని, బలమైన, స్వయంప్రతిపత్తి గల భారతదేశం వైపు మనల్ని నడిపించే వ్యూహమని మంత్రి అన్నారు. త్వరలోనే బహుళ రంగాలలో సహజ ప్రయోజనాలతో గ్లోబల్ ఎకనామిక్ ప్లేయర్‌గా భారత్ ఉద్భవిస్తుందన్నారు.

ఐఎస్‌బీలో...
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ఐఎస్‌బీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ బిజినెస్ అండ్ డిప్లొమసీ’ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, హీరో ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్‌కాంత్ ముంజల్ తెలిపారు. ప్రస్తుతం ఐఎస్‌బీ డీన్‌గా ప్రొఫెసర్ రాజేంద్ర శ్రీవాత్సవ ఉన్నారు.
Published date : 17 Nov 2020 05:25PM

Photo Stories