డీఆర్‌డీవో రూపొందించిన బైక్ అంబులెన్స్ పేరు?
Sakshi Education
నక్సలిజం, వేర్పాటువాదం ప్రభావ ప్రాంతాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనుబంధ సంస్థ... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్(ఐఎన్‌ఎమ్‌ఏఎస్) ప్రత్యేక బైక్ అంబులెన్స్ ను రూపొందించింది.
ఈ అంబులెన్స్‌కు ‘‘రక్షిత’’ పేరు పెట్టారు. 21 రక్షిత అంబులెన్స్ లను జనవరి 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్(లైఫ్ సెన్సైస్), శాస్త్రవేత్త డాక్టర్ ఏకే సింగ్.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)కు అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘రక్షిత’’ పేరుతో బైక్ అంబులెన్స్ రూపకల్పన
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : డీఆర్‌డీవో అనుబంధ సంస్థ... ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సెన్సైస్(ఐఎన్‌ఎమ్‌ఏఎస్)
ఎందుకు : నక్సలిజం, వేర్పాటువాదం ప్రభావ ప్రాంతాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు
Published date : 20 Jan 2021 05:53PM