Skip to main content

దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మ‌న్‌గా నియమితులైన రిటైర్డు జడ్జి?

ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మ‌న్‌గా రిటైర్డు జిల్లా జడ్జి కేవీఎల్ హరినాథ్ నియమితులయ్యారు.
Current Affairs
ఈ మేరకు మార్చి 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరినాథ్‌ బాధ్యతలు చేపట్టే రోజు నుంచి మూడేళ్ల పాటు గానీ, లేదంటే అతనికి 65 ఏళ్ల వయస్సు నిండే వరకు ఏది ముందు అయితే ఆ మేరకు ఆ విధుల్లో కొనసాగుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస రావు ఉన్నారు.

ఎస్‌ఆర్‌ఎం ప్రొఫెసర్‌కు రూ.1.10 కోట్ల డీబీటీ ప్రాజెక్టు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బయాలజీ విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సి.దుర్గారావుకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ పరిశోధన ప్రాజెక్టు లభించింది. జంతు సంబంధ రోటా వైరస్‌ కంటే వేగంగా మానవ రోటా వైరస్‌ను సెల్‌ కల్చర్‌లో అభివృద్ధి చేయడం కోసం అవసరమైన పరిశోధనలు నిర్వహించేందుకు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) రూ.1.10 కోట్లు విడుదల చేసింది. మూడేళ్ల పాటు సాగే ఈ పరిశోధన వలన భవిష్యత్తులో ఏదైనా వ్యాధికి కనుగొనే వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తక్కువ ధరకే అది లభించే అవకాశం ఉంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డు జడ్జి?
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : రిటైర్డు జిల్లా జడ్జి కేవీఎల్‌ హరినాథ్‌
Published date : 01 Apr 2021 06:31PM

Photo Stories