Skip to main content

దేశంలోని ఏ నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ప్రక్రియ ప్రారంభమైంది?

దేశవ్యాప్త కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుండగా సన్నాహకాల్లో భాగంగా డిసెంబర్ 28న డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్) ప్రారంభమైంది.
Current Affairs
టీకా సరఫరా, పంపిణీ, వ్యాక్సినేషన్ మొదలుకొని ప్రతి అంశంపై పరిశీలన జరిపి, వాస్తవ వ్యాక్సినేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.

నాలుగు రాష్ట్రాల్లో...
ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం రాష్ట్రాలలో డిసెంబర్ 28న డ్రైరన్ కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ 29వ తేదీన కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడ, గుజరాత్‌లోని గాంధీనగర్, రాజ్‌కోట్, పంజాబ్‌లోని లూధియానా, షహీద్ భగత్ సింగ్ నగర్ (నవాన్‌షహర్), అస్సాంలోని సోనిత్‌పూర్, నల్బరీ జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలైంది.

డ్రై రన్ అంటే?
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం
ఎందుకు : కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా
Published date : 29 Dec 2020 05:39PM

Photo Stories