డచ్ ఓపెన్‌లో లక్ష్య సేన్‌కు టైటిల్
Sakshi Education
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్‌కు టైటిల్ లభించింది.
నెదర్లాండ్‌లోని అల్మెరెలో అక్టోబర్ 13న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 15-21, 21-14, 21-15తో యుసుకె ఒనోడెరా (జపాన్)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో... ఉత్తరాఖండ్‌కు చెందిన 18 ఏళ్ల లక్ష్య సేన్ తన కెరీర్‌లో తొలి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నట్లయింది. లక్ష్య సేన్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షలు) తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
డచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఐదో భారతీయ ప్లేయర్ లక్ష్య సేన్. గతంలో ప్రకాశ్ పదుకొనే (1982లో), చేతన్ ఆనంద్ (2009లో), అజయ్ జయరామ్ (2014, 2015లలో), సౌరభ్ వర్మ (2018లో) ఈ ఘనత సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టైటి ల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : లక్ష్య సేన్
ఎక్కడ : అల్మెరె, నెదర్లాండ్

Published date : 14 Oct 2019 05:51PM