డబ్ల్యూటీఏ టోర్ని విజేతగా యాష్లే బార్టీ
Sakshi Education
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) విజేతగా నిలిచింది.
చైనాలోని షెన్‌జెన్‌లో నవంబర్ 3న జరిగిన డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో యాష్లే బార్టీ 6-4, 6-3తో డిఫెండింగ్ చాంపియన్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. విజేతగా నిలిచిన యాష్లే బార్టీకి 44 లక్షల 20 వేల డాలర్లు (రూ. 31 కోట్ల 17 లక్షలు).... రన్నరప్ స్వితోలినాకు 24 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 92 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతకు ఇంత భారీ మొత్తం ప్రైజ్‌మనీ ఇవ్వడం ఇదే తొలిసారి.
బాబోస్-మ్లాడెనోవిచ్ జంటకు డబుల్స్ టైటిల్
డబ్ల్యూటీఏ టోర్నీ డబుల్స్ విభాగంలో తిమియా బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జంట 6-1, 6-3తో సు వె సెయి (చైనీస్ తైపీ)-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలిచింది. టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచినందుకు తిమియా-క్రిస్టినా జంటకు 10 లక్షల డాలర్ల (రూ. 7 కోట్లు) ప్రైజ్‌మనీ లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్ని విజేత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)
ఎక్కడ : షెన్‌జెన్, చైనా

Published date : 04 Nov 2019 05:44PM